Tuesday, 6 March 2012

naagayya tyaagayya

         సంగీతమే ప్రధానంగా అంటే సంగీతం చిత్రంలో అంత ర్భాగమైన చిత్రా లలో `నభూతో న భవిష్యతి ' అని         ఘంటాపదంగా చెప్పగలిగే చిత్రం నాగయ్య నటించిన `త్యాగయ్య'.నాగయ్య సొంత సంస్థ  `రేణుక'పైన నిర్మించిన ఈ చిత్రం    దర్శకత్వం ,సంగీత దర్శకత్వ  బాధ్యతలు తానే వహించి సర్వోత్తమంగా తీర్చి దిద్ది ఆయన కీర్తిని      శాశ్వతం చేసుకున్నారు.antae kaadu    
1946 లో విడుదలైన ఈ చిత్రం ఆంధ్రదేశం తో పాటు  ,తమిళ,కన్నడ,కేరళ రాష్ట్రాలలో కూడా విజయవంతంగా ప్రదర్శింప బడడమే కాక తరువాతికాలంలో విదేశాలలో కుడా ప్రదర్శింప బడి  కర్నాటక సంగీతానికి అఖండ ఖ్యాతి సంపాదించిపెట్టింది.
   1942 లో వాహిని సంస్థ  నిర్మించిన భక్తపోతన  చిత్రం సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలో పోతన పాత్రను న భూతో న భవిష్యతి అన్నట్టుగా పోషించిన నాగయ్య ను కారణ జన్ములు గా   గౌరవించి ఆరాధించడం అప్పటినుండేప్రారంభమైంది.

Monday, 5 March 2012

bharateeya chalana chitra sangeetam

                    భారతీయ చలనచిత్రకళ లో సంగీతం ఒక అంతర్భాగం .చలన చిత్రాల  సంగీతానికి ఒక విశిష్టత ఉంది;ఒక చరిత్ర వుంది. .హిందీ,తెలుగు,తమిళం,కన్నడం,మలయాళం,బెంగాలి మొదలైన అన్ని భాషా చిత్రాలలోను మంచి పాటలు ,మంచి సంగీతంగా చెప్పుకోతగ్గ స్థాయి లో సినిమా పాటలు కొన్ని వేలు ఉన్నాయి.కేవలం మూడు నిమిషాల పాటలోనే శాస్త్రీయ సంగీత రాగాలలోని లోని సొబగుల్ని, వాటి బహుముఖ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ ఒక్కో సందర్భంలో ఎందరో ప్రముఖ వాగ్గేయ కారుల సంగీత రచనలని కూడా అధిగమించే స్థాయిలో స్వర రచన చేసి దశాబ్దాలు గడచినా మరువలేనటువంటి బాణీలు సృష్టించిన సంగీత దర్సకులెందరో చలన చిత్ర సంగీతానికి ఒక గౌరవం చేకూర్చిపెట్టారు.
           కేవలం సంగీతం వల్లనే చిత్రాలు శత దినోత్సవం జరుపుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి అంటే అది అతిశయోక్తి కాబోదు..    అయితే అనుకరణ ప్రభావం తోనూ ,తక్కిన పరిస్థితుల ప్రభావంతోనూ సినిమా పాటలలోని మాధుర్యం తగ్గిపోయింది.కేవలం సౌండ్  కే ప్రాధాన్యత పెరిగింది.సాంకేతికంగా ఎంత ఎదిగినా `మంచి పాటలు 'అని చెప్పుకోవలసివస్తే పాట పాటలే గుర్తు వస్తాయి.దానికి కారణం పాత చిత్రాల నిర్మాతలు,దర్శకులు,నటులు,సంగీత దర్శకులు,గేయ రచయితలూ అందరూ మంచి అబిరుచి కలిగి ఉండడమే కాక  వారికి ,సంగీతం పట్ల చక్కని అవగాహన ,ప్రవేశం కూడా ఉండడమే!
                     నాటి చలన చిత్ర సంగీతం లోని విశిష్టత లను ఒక` థీసిస్'లా పరిశోధనాత్మకంగా  విశ్లేషించి చూపడమే నా లక్ష్యం .
                  నా ఈ ప్రయత్నం మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుందని నా నమ్మకం.